అరుణ్ జైట్లీ స్టేడియంలో కేఎల్ రాహుల్ రికార్డుల మోత

  • ఐపీఎల్‌లో 152* పరుగులతో రాహుల్ అద్భుత ఇన్నింగ్స్
  • ఐపీఎల్ లో ఓ భారత బ్యాటర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే!
  • లీగ్ చరిత్రలో ఇది మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు
  • మొత్తం పరుగుల జాబితాలో ఐదో స్థానానికి చేరిక
  • వెయ్యికి పైగా పరుగులు చేసిన వారిలో రెండో అత్యుత్తమ యావరేజ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సరికొత్త రికార్డులతో దుమ్మురేపాడు. నిలకడకు మారుపేరుగా నిలుస్తూనే, విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ముఖ్యంగా ఇవాళ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌పై అద్భుత ప్రదర్శన చేశాడు.

152* పరుగులతో రికార్డ్

 ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బౌలర్లను ఊచకోత కోసిన రాహుల్, కేవలం 152 బంతుల్లోనే నాటౌట్‌గా నిలిచి, ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాటర్ గా రికార్డు పుటల్లోకెక్కాడు. అంతేకాదు, ఓవరాల్ గా ఐపీఎల్ చరిత్రలో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (175*), బ్రెండన్ మెకల్లమ్ (158*) మాత్రమే అతని కన్నా ముందున్నారు. అంతేకాకుండా, పురుషుల టీ20 క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసింది కూడా రాహులే. గతంలో తిలక్ వర్మ 151 పరుగులు చేయగా, ఇప్పుడు 152 పరుగులతో రాహుల్ ఆ రికార్డును తన పేరిట లిఖించకున్నాడు.

ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు

175* - క్రిస్ గేల్ (RCB) vs PWI, బెంగళూరు, 2013
158* - బ్రెండన్ మెకల్లమ్ (KKR) vs RCB, బెంగళూరు, 2008
152* - కేఎల్ రాహుల్ (DC) vs PBKS, ఢిల్లీ, 2026
141 - అభిషేక్ శర్మ (SRH) vs PBKS, హైదరాబాద్, 2025
140* - క్వింటన్ డి కాక్ (KKR) vs LSG, ముంబై DYP, 2022

పురుషుల టీ20 క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్లు 


1. 152* - కేఎల్ రాహుల్ (ఢిల్లీ క్యాపిటల్స్) vs పంజాబ్ కింగ్స్, ఢిల్లీ, 2026
2. 151 - తిలక్ వర్మ (హైదరాబాద్) vs మేఘాలయ, రాజ్‌కోట్, 2024
3. 148 - అభిషేక్ శర్మ (పంజాబ్) vs బెంగాల్, సికింద్రాబాద్, 2025
4. 147 - శ్రేయస్ అయ్యర్ (ముంబై) vs సిక్కిం, ఇండోర్, 2019
5. 146* - పునిత్ బిష్త్ (మేఘాలయ) vs మిజోరం, చెన్నై, 2021

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు

కేవలం భారీ స్కోర్లు చేయడమే కాదు, నిలకడగా పరుగులు సాధించడంలోనూ రాహుల్ ముందున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో 5,579 పరుగులతో ఐదో స్థానానికి చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ అతని కంటే ముందున్నారు. ఇక బ్యాటింగ్ యావరేజ్ విషయానికొస్తే, ఐపీఎల్‌లో వెయ్యికి పైగా పరుగులు చేసిన 109 మంది బ్యాటర్లలో సాయి సుదర్శన్ (47.16) తర్వాత అత్యుత్తమ యావరేజ్ (46.88) రాహుల్‌దే కావడం అతని నిలకడకు నిదర్శనం.

8989 - విరాట్ కోహ్లీ
7183 - రోహిత్ శర్మ
6769 - శిఖర్ ధావన్
6565 - డేవిడ్ వార్నర్
5579 - కేఎల్ రాహుల్
5528 - సురేశ్ రైనా
5439 - ఎంఎస్ ధోనీ

KL Rahul
KL Rahul IPL
Delhi Capitals
Punjab Kings
IPL Records
T20 Cricket
Arun Jaitley Stadium
Highest Score
Cricket
Indian Premier League

More Telugu News